ప్రముఖ నిర్మాత బంధువు ఇంట్లో భారీ చోరీ

ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 05:21 AM IST
ప్రముఖ నిర్మాత బంధువు ఇంట్లో భారీ చోరీ

Updated On : December 28, 2019 / 5:21 AM IST

ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు.

ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌‌తో తనిఖీలు నిర్వహించారు. రామ్మోహన్ రావు.. దివంగత దగ్గుబాటి రామానాయుడికి సోదరుడు అవుతారు.

ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చోరీలు జరక్కుండా పోలీసులు భద్రత పెంచాలని స్థానికులు కోరారు.