వారెవ్వా.. అమెరికాలో ట్రంప్, బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్ సభలకు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ సభకు..

అమెరికాలో ఆయన ఇటువంటి వేదికలను ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

వారెవ్వా.. అమెరికాలో ట్రంప్, బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్ సభలకు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ సభకు..

Updated On : March 14, 2025 / 4:29 PM IST

కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ వేదికను తలదన్నేలా ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌ కొల్లిపర ఆధ్వర్యంలో వేదిక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

గతంలో అమెరికాలో ఆయన ఇటువంటి వేదికలను ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్ వంటి వారికి కూడా ఆయన ఇటువంటి సభలను ఏర్పాటు చేశారు.

Also Read: మొట్టమొదటిసారి ఈ మార్కును దాటిన బంగారం ధరలు.. మీరు కొంటున్నారా?

భారత్‌లో గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సభలకు కూడా ఇటువంటి వేదికలను ప్రశాంత్‌ కొల్లిపర సిద్ధం చేశారు. దాదాపు 12 రోజుల నుంచి 470 మంది సాంకేతిక నిపుణులతో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం సభను సిద్ధం చేశారు.

అత్యాధునిక హంగులతో ఆడియో, వీడియో సిస్టమ్స్‌ ఇక్కడ ఉండేలా చేశారు. సభా ప్రాంగణం నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్నప్పటికీ వీఐపీ గ్యాలరీలో ఉన్న అనుభూతి వారికి కలుగుతుంది.

అలాగే, 15 ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ తో పాటు 70 సీసీ కెమెరాలు ఉన్నాయి. దాదాపు 15 డ్రోన్లను ఈ సభ కోసం వాడుతున్నారు. ఈ సభ కోసం ప్రభుత్వం 1,700 మంది పోలీసులను పంపింది. ఇవాళ రాత్రి 11 గంటల వరకు కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.