బాణాసంచా తయారీలో ప్రమాదం…ముగ్గురికి గాయాలు

Three injured in disagreement manufacture ammunition : దీపావళి పండుగ పూట ఆ ఇంటి విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. విశాఖజిల్లా చోడవరం పట్టణంలోని అన్నవరం కాలనీలో, అంబేద్కర్ వీధిలో ఒక ఇంటిలోని వారు బాణాసంచా తయారు చేస్తున్నారు.
ఈసమయంలో ఉన్నట్టుండి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13) లకు కాళ్లు చేతులు కాలడంతో వారిని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో జ్యోసిత పరిస్ధితి విషమంగా ఉండటంతో ఆమెను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.