ఏపీ సముద్రతీరంలోకి కొట్టుకొచ్చిన కుళ్లిపోయిన మృతదేహాలు

ఎవరో తెలీదు..ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయో తెలీదు ఏపీలోని సముద్రతీరంలోకి మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఎవరన్నా చంపి సముద్రంలో పారేశారా? లేక ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయారో తెలీదుగానీ..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి సమీపంలోని సముద్ర తీర ప్రాంతంలో మూడు మృతదేహాలు కలకలం రేపాయి.
సముద్రం నుంచి మూడు గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకువచ్చాయి. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వాటిని చూసి అక్కడి ప్రజలు హడలిపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకొని వాటిని పోస్టుమార్టం కోసం పంపించి దర్యాప్తు చేపట్టారు.
https://10tv.in/fears-42-crew-and-6000-cattle-drowned-after-ship-sinks-in-typhoon-off-japan/
గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది..కేశవదాసుపాలెం గ్రామాల మధ్య ఉన్న సముద్ర తీరానికి అక్కడక్కడ మృతదేహాలు కనిపించాయి. స్థానిక మత్స్యకారులు వాటిని పరిశీలించారు. అందులో ఒకరు మహిళ, ఇద్దరు పురుషులుగా గుర్తించారు. సముద్రంలో పడవ ప్రమాదం కారణంగా చనిపోయిన వారు ఇలా కొట్టుకొని వచ్చారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. శవాలు కుళ్లిపోవడంతో గుర్తు పట్టడం కష్టంగా మారిందని పోలసులు అంటున్నారు. కాగా పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే గానీ..వారు ఎలా చనిపోయారు? చనిపోయి ఎన్ని రోజులైంది వంటి విషయాలు వెల్లడికావాల్సి ఉంది.