30నిమిషాల్లోనే వెంకన్న దర్శనం

  • Published By: venkaiahnaidu ,Published On : September 15, 2019 / 04:27 AM IST
30నిమిషాల్లోనే  వెంకన్న దర్శనం

Updated On : September 15, 2019 / 4:27 AM IST

60 ఏళ్లు దాటిన వృద్ధులకు తిరుమలలో 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు.. ఇలా రెండు సమయాలను కేటాయించామన్నారు.  ఫొటోతో ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకొని భక్తులు ఎస్-1 కౌంటర్ దగ్గర చూపించాల్సి ఉంటుంది.

వీరి దర్శనం కోసం మిగతా అన్ని లైన్లను నిలిపేస్తారు. సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడిపాలు వీరికి ఉచితంగా ఇస్తారు. వీరికి రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తారు. అదనంగా లడ్డూ కావాలంటే  రూ.25కు లడ్డూ చొప్పున అందిస్తారు.  సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడిపాలు వీరికి ఉచితంగా ఇస్తారు. కౌంటర్ నుంచి గుడికి, గుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు.