తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత

  • Published By: sreehari ,Published On : September 16, 2020 / 06:56 PM IST
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత

Updated On : September 16, 2020 / 7:23 PM IST

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గా ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్లి దుర్గా ప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 1994లో చంద్రబాబు కేబినెట్ లో దుర్గా ప్రసాద్ మంత్రిగా పనిచేశారు.



నెల్లూరు జిల్లాలో  వెంకటగిరి దుర్గాప్రసాద్‌ స్వస్థలం. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో దుర్గా ప్రసాద్ చేరారు. అదే ఏడాదిలో వైసీపీ తరపున తిరుపతి ఎంపీగా దుర్గా ప్రసాద్ గెలిచారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు దుర్గా ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో టీడీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా దుర్గా ప్రసాద్ పనిచేశారు.

బల్లి దుర్గాప్రసాద్ మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గా ప్రసాద్ కుమారుడితో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడారు. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.