Red Sandalwood Seized : తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం.. 25 మంది స్మగ్లర్లు అరెస్టు

పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు.

Red Sandalwood Seized : తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం.. 25 మంది స్మగ్లర్లు అరెస్టు

Red Sandalwood Seized

Updated On : October 12, 2023 / 3:56 PM IST

Tirupati Police Seized Red Sandalwood : తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనలో 25 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు చేశారు. వీరి నుంచి 21ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు వాహనాలను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా రెడ్డివారి పల్లి ఫారెస్ట్ పరిధిలోని పెద్దకోనవంక వద్ద ఒక ఘటన, కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద మరో ఘటన చోటు చేసుకుంది.

ఈ మేరకు గురువారం తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ చెంచుబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిలో పీడీయాక్టు నమోదైన నిందితులు ఉన్నారని తెలిపారు.

Lokesh : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం

పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నామని తెలిపారు.

బెంగళూరు నుంచి వయా అనంతపురం మీదుగా నంద్యాల వైపు చేరుకుని శేషాచలం అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు చేరుకుంటున్నారని వెల్లడించారు. స్మగ్లర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని చెప్పారు.