Andhra Pradesh : ఏపీలో టూరిజం ప్లేస్‌‌లు ప్రారంభం

లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.

Andhra Pradesh : ఏపీలో టూరిజం ప్లేస్‌‌లు ప్రారంభం

Tourism Places Start In Ap Minister Avanthi Srinivas

Updated On : June 23, 2021 / 5:42 PM IST

AP Tourism : ఏపీ రాష్ట్రంలో మళ్లీ పర్యాటక రంగం కళకళలాడనుంది. టూరిజం ప్లేస్ లు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. కరోనా కారణంగా..అన్ని రంగాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం లాక్ డౌన్, కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పర్యాటక రంగంపై ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఈ రంగానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.

ఈ మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ ప్రకటన చేశారు. లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని…9 చోట్ల కమాండ్ కంట్రోల్ రూం పెట్టామన్నారు. 1138 మంది ఉద్యోగులను తొలగించకుండా జీతాలు ఇచ్చామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విశాఖపట్నంకు కొట్టుకవచ్చిన బంగ్లాదేశ్ షిప్ ను రెస్టారెంట్ గా మార్చనున్నట్లు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ ల కోసం క్వాలిటీ లిక్కర్ బ్రాండ్ లకు అనుమతి ఇచ్చామన్నారు. గండికోటను ప్రత్యేక టూరిజంగా అభివృద్ధి చేయనున్నట్లు, రాయలసీమ కే తలమానికం లాగా అభివృద్ధి చేస్తామన్నారు. 13 చోట్ల 7 స్టార్ హోటల్ లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తో పెట్టనున్నట్లు మంత్రి అవంతి వెల్లడించారు.