Vijayawada: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు

Vijayawada: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Vijayawada

Updated On : January 25, 2022 / 1:32 PM IST

Vijayawada : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈమేరకు మంగళవారం నగర కమిషనర్ కాంతి రానా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు. బుధవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈమేరకు వాహనదారులు, నగర వాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని కమిషనర్ వివరించారు.

Also read: Telangana High court: కరోనా ఆంక్షల అమలుపై హైకోర్టు పెదవి విరుపు, విచారణ 28కి వాయిదా

బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా బస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ కూడలి, శిఖామణి కూడలి నుంచి వెటర్నరీ కూడలి వైపు యధావిధిగా వాహన రాకపోకలుంటాయి. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు వీఐపీల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పాత కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వైపు వచ్చే అన్ని వాహనాలను రెండు మార్గాల్లో దారి మళ్లించారు. ఆర్టీసీ వై జంక్షన్, కార్ల్ మార్క్స్ రోడ్డు, విజయా టాకీస్, చుట్టుగుంట, పడవల రేవు, రామవరప్పాడు మీదుగా దారి మళ్లించారు. అదేవిధంగా ఆర్టీసీ వై జంక్షన్, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, కృష్ణలంక హైవే స్క్రూ బ్రిడ్జి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. రీపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో విజయవాడ నగర ప్రజలంతా సహకరించాలని కమిషనర్ కాంతి రానా కోరారు.

Also read: Space News: భూమి నుంచి 10 లక్షల కి.మీ దూరంలో పార్కింగ్ చేసుకున్న “జేమ్స్ వెబ్” టెలీస్కోప్