Eluru Boat Capsize : ఏలూరులో విషాదం.. కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా, ఇద్దరు మృతి

ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు కూలీలతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడగా ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. కలకర్రు గ్రామ సమీపంలోని కొల్లేరు సరస్సులో పడవ బోల్తా పడింది.

Eluru Boat Capsize : ఏలూరులో విషాదం.. కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా, ఇద్దరు మృతి

Updated On : November 1, 2022 / 6:27 PM IST

Eluru Boat Capsize : ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు కూలీలతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడగా ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఏలూరు రూరల్‌ మండలం కలకర్రు గ్రామ సమీపంలోని కొల్లేరు సరస్సులో పడవ బోల్తా పడింది.

కొల్లేరులో తూడు కోసేందుకు కూలీలతో వెళ్లిన పడవ ఒక్కసారిగా తిరగబడింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఏడుగురు కూలీల్లో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు నీటిలో మునిగి మరణించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నీటిలో పడిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను పైడితల్లి, గౌరమ్మగా గుర్తించారు.