తిరుపతి తిరుచానూరు శిల్పారామంలో ప్రమాదం.. ఒకరు మృతి
శిల్పారామంలో సందర్శకుల ఆహ్లాదం కోసం ఓ ప్రైవేట్ సంస్థ గేమ్ జోన్ ను నిర్వహిస్తోంది.

Tiruchanur Shilparamam Tragedy : తిరుపతి తిరుచానూరులోని శిల్పారామంలో ప్రమాదం జరిగింది. ఫన్ రైడ్ లో క్రాస్ వీల్ తిరుగుతుండగా రాడ్ విరిగిపోయింది. దీంతో ఇద్దరు మహిళలు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయారు. ఒక మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆవిడను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిల్పారామంలో సందర్శకుల ఆహ్లాదం కోసం ఓ ప్రైవేట్ సంస్థ గేమ్ జోన్ ను నిర్వహిస్తోంది. వినోదం కాస్తా విషాదంగా మారింది.
తిరుపతి సమీపంలోని తిరుచానూరు వద్ద శిల్పారామం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడ విషాదం చోటు చేసుకుంది. శిల్పారామానికి వచ్చే సందర్శకుల కోసం ఓ ప్రైవేట్ సంస్థ ఫన్ రైడ్ పేరిట ఒక గేమింగ్ జోన్ నిర్వహిస్తోంది. ఇందులో రకరకాల వీల్ చైర్స్ ఉన్నాయి. పిల్లలు, పెద్దలకు సంబంధించిన గేమ్స్ ఉన్నాయి. అయితే క్రాస్ వీల్ పై కూర్చుని తిరుగుతూ ఉండగా ఒక్కసారిగా రాడ్ విరిగిపోయింది.
దీంతో బాక్స్ లో ఉన్న ఇద్దరు మహిళలు పైనుంచి కింద పడిపోయారు. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. వారిలో ఒకరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలిని లోకేశ్వరిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మహిళను రుయా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, శిల్పారామంలో గేమ్ జోన్ నిర్వహణ సక్రమంగా లేదని సందర్శకులు మండిపడుతున్నారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ప్రమాదం సందర్శకులను షాక్ కి గురి చేసింది. ఈ ఘటనను కళ్లారా చూసిన వారు షాక్ కి గురయ్యారు. క్రాస్ వీల్ పై ఉన్న ఇతరులు పెద్దగా కేకలు వేశారు. క్రాస్ వీల్ పైన ఉన్న సమయంలోనే రాడ్ విరిగి బాక్స్ లో ఉన్న మహిళలు అంత ఎత్తు నుంచి నేల మీద పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు స్పాట్ లోనే మరణించారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికలపై మౌనంగా వైసీపీ.. ఆ భయమే కారణమా?