ఎమ్మెల్సీ ఎన్నికలపై మౌనంగా వైసీపీ.. ఆ భయమే కారణమా?

ఏమైనా ఈవీఎంల్లో కుట్ర చేసి ఓడించారని పదేపదే చెప్తున్న జగన్‌.. బ్యాలెట్‌తో జరిగే ఎన్నికలను ఎందుకు లైట్‌ తీసుకుంటున్నారో... వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అంటూ.. నిట్టూరుస్తున్నారు ఫ్యాన్‌ పార్టీ తీరు చూసి జనం.

ఎమ్మెల్సీ ఎన్నికలపై మౌనంగా వైసీపీ.. ఆ భయమే కారణమా?

Gossip Garage Ysrcp Silence (Photo Credit : Google)

Updated On : November 2, 2024 / 10:59 PM IST

Gossip Garage : గెలిచామా, ఓడామా అని కాదు.. యుద్ధం చేశామా లేదా అనేది ముఖ్యం. రాజకీయాలకు పక్కాగా సరిపోయే డైలాగ్ ఇది. గెలుపు, ఓటమి తర్వాత.. పోటీ చేశామా లేదా అనేదే పాలిటిక్స్‌లో ఇంపార్టెంట్‌. బలం తెలిసేది.. బలహీనతలు అర్థం అయ్యేది అప్పుడే! అలాంటిది.. ఎన్నికలపై సైలెన్స్ అంటోంది వైసీపీ. ఫ్యాన్‌ పార్టీ తీరుకు అర్థమేంటి.. ఎన్నికలంటే వైసీపీ భయపడుతోందా.. మౌనం వెనక అసలు కారణం ఏంటి..

ఎన్నికలపై వైసీపీ మౌనంపై కొత్త చర్చ..
ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయ్. రెండు గ్రాడ్యుయేట్‌ ఎన్నికలతో పాటు.. విజయనగరం స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయ్. అసలు ఎందుకు ఓడామో అర్థం కావడం లేదంటూ నిట్టూరుస్తున్న వైసీపీకి.. తమ బలం ఇదీ అని నిరూపించుకునేందుకు ఒక రకంగా దక్కిన మూడు అవకాశాలు ఇవి. ఓడినా సరే.. బలం ఏంటో ప్రూవ్ చేసుకునే చాన్స్ దక్కింది ఒక రకంగా. అలాంటిది వైసీపీ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై మౌనంగా కనిపిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. ఈ ఎలక్షన్స్‌పై వైసీపీ ఫుల్ సైలెన్స్ మెయింటేన్‌ చేయడం.. కొత్త చర్చకు దారి తీస్తోంది.

అభ్యర్థులను ప్రకటించేసిన టీడీపీ..
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్… ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలకు.. టీడీపీ అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉంది. ఐతే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ఈ నెలలోనే జరగాల్సి ఉంది. ఐనా సరే వైసీపీలో చలనం లేదన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజు… ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో అనర్హత వేటు పడింది. దీంతో ఎన్నిక అనివార్యం అయింది. ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.

ఇంకా ఖరారు కాని వైసీపీ అభ్యర్థి..
ఉమ్మడి గోదావరి జిల్లాలకు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ ఇంకా అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. ఐతే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. గౌతం రెడ్డిని ఎంపిక చేసింది. ఇక్కడ కూటమి నుంచి మాజీ మంత్రి ఆలపాటి ఉన్నారు. ఆయనకు మూడు పార్టీల నుంచి పూర్తి మద్దతు ఉంది. ఆలపాటి ప్రచారం కూడా మొదలెట్టేశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా కూటమి నేతలే ఎక్కువగా చేస్తున్నారు. అదే వైసీపీలో ఒక సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది. గౌతం రెడ్డి ప్రచారంలోకి దిగుతారా లేదా అన్నది కూడా అర్థం కావడం లేదు. నిజంగా ఈ ఎన్నికలను వైసీపీ సీరియస్‌గా తీసుకొని ఉండి ఉంటే.. పట్టభద్రుల ఓటర్ల నమోదుని స్టార్ట్ చేసి ఉండేది. అలాంటిదేమీ కనిపించకపోవడంతో.. ఈ ఎన్నికలను లైట్‌ తీసుకున్నట్లు కన్ఫార్మ్‌గా కనిపిస్తోంది.

బ్యాలెట్‌తో జరిగే ఎన్నికలను జగన్ ఎందుకు లైట్‌ తీసుకుంటున్నారో..
వైసీపీది మౌనం కాదు.. భయం అనే విమర్శలు వినిపిస్తున్నాయ్. రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో కూటమి బలంగా ఉంది. పైగా రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత… వైసీపీ నుంచి నేతలు వరుసపెట్టి కూటమి పార్టీల్లోకి వెళ్తున్నారు. దీంతో ఫ్యాన్‌ పార్టీ వీక్‌గా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటే ఓటమి ఖాయం అని వైసీపీ భయపడుతోందని.. అందుకే లైట్‌ తీసుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటే అభాసుపాలు కావడం ఖాయమని.. వైసీపీ నేతలు ఫిక్స్ అయ్యారట. అందుకే మౌనంగా ఉంటున్నారట. ఏమైనా ఈవీఎంల్లో కుట్ర చేసి ఓడించారని పదేపదే చెప్తున్న జగన్‌.. బ్యాలెట్‌తో జరిగే ఎన్నికలను ఎందుకు లైట్‌ తీసుకుంటున్నారో… వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అంటూ.. నిట్టూరుస్తున్నారు ఫ్యాన్‌ పార్టీ తీరు చూసి జనం.

 

Also Read : రాజులు కూడా ఇలాంటి ప్యాలెస్‌లు కట్టలేదు..! రుషికొండ భవనాలు చూశాక సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..