టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

ttd board meeting key decisions

Updated On : March 11, 2024 / 4:27 PM IST

TTD Board Meeting: టీటీడీ ఆలయాల అభివృద్ధి పనుల కోసం శ్రీవాణి ట్రస్టు నిధులు వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం
టీటీడీ కళాశాలలో హాస్టల్ గదులు కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయం
తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో 10 లిఫ్టుల ఏర్పాటుకు 1.88 కోట్లు కేటాయింపు
టీటీడీ డేటా సెంటర్ల నిర్వహణకు 12 కోట్లు కేటాయింపు

Also Read: మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఎంపిక వెనుక సీఎం జగన్ పక్కా వ్యూహం

కనీస వేతనంపై యానాదయ్య హర్షం
నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధవటం యానాదయ్య హర్షం వ్యక్తం చేశారు. తిరుమల కళ్యాణకట్టలో క్షురకులు, సన్నాయి, డోలు వాయిద్యకారులకు కనీస వేతనం కోసం 110 జీవోను టీటీడీ జారీ చేసింది. దీని ప్రకారం కళ్యాణకట్టలో క్షురకులకు నెలకు రూ. 20 వేలు కనీస వేతనం అందుతుంది. సన్నాయి, డోలు వాయిద్యకారులు రూ.21,500 వేతనం అందుకుంటారు. తాజా జీవోతో మొత్తం 1150 మంది నాయీబ్రాహ్మణులకు లబ్ది చేకూరనుందని యానాదయ్య తెలిపారు.