YV Subbareddy : టీటీడీ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ స్వీకరించడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు.

YV Subbareddy : టీటీడీ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy

YV Subbareddy : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి రద్దీ దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని వెల్లడించారు. టీటీడీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. టీటీడీ అధికారులు మెంబర్ లతో కమిటీ వేశామని పేర్కొన్నారు.

అలిపిరి వద్ద ఉన్న టీటీడీ పురాతన గొడౌన్లు పునర్ నిర్మాణానికి రూ.18 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి పనులకు రూ.3.12 కోట్లతో టెండర్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

TTD: సెలవుల వేళ టీటీడీలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

ఢిల్లీలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మే 3 నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మే నెలాఖరుకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీనివాస సేతుకు ఇప్పటివరకు రూ.287 కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు.

అలాగే టీటీడీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ స్వీకరించడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. చెల్లించిన రూ.3 కోట్ల పెనాల్టీ తిరిగి పొందే విధంగా కేంద్ర హోంమంత్రి సహకారంతో రీ ఫండ్ పొందటానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.