TTD Slotted Free Darshan Tokens : తిరుపతిలో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ ప్రారంభం

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం మూడు కేంద్రాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయనుంది.

TTD Slotted Free Darshan Tokens : తిరుపతిలో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ ప్రారంభం

TTD

Updated On : November 1, 2022 / 9:33 AM IST

TTD slotted free darshan tokens : తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం మూడు కేంద్రాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయనుంది.

మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు టీటీడీ జారీ చేయనుంది. ఆధార్ కార్డుతో ఒకసారి సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే నెల రోజుల వరకు మళ్లీ ఉచిత దర్శన టోకెన్ ఇవ్వరని టీటీడీ స్పష్టం చేసింది. టోకెన్లు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరని పేర్కొంది.

Tirumala Srivari Break Darshan : డిసెంబరు 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్పు

టోకెన్లు తీసుకున్న వాళ్లకి అదే రోజే దర్శన సమయం కేటాయిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుపతిలో ఉచిత దర్శనం టోకెన్లు దొరకని భక్తులను తిరుమల క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వ దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.