Thirumala : నేడు శ్రీవారి వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల

జనవరి నెలకు సంబంధించిన టికెట్లు ఇవాళ ఉదయం 9గంటలకు విడుదల కానున్నాయి. రోజుకు 5వేల 500, 12 వేలు, 20 వేల చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Thirumala : నేడు శ్రీవారి వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల

Ttd

Updated On : December 23, 2021 / 7:06 AM IST

Srivari Virtual Service Darshan tickets : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా దర్శనం టికెట్ల కోటాను ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధించిన టికెట్లు ఇవాళ ఉదయం 9గంటలకు విడుదల కానున్నాయి. రోజుకు 5వేల 500, 12 వేలు, 20 వేల చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి నెలకు సంబంధించి రోజుకు 20 వేల చొప్పున ఆరు లక్షల 20 వేల టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది. అలాగే ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

CM Jagan : నేటి నుంచి సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన

జనవరికి సంబంధించి రోజుకు 5 వేల చొప్పున మొత్తం లక్షా 55 వేల సర్వదర్శనం టికెట్లను ఇస్తామని వెల్లడించింది. సర్వదర్శనం ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలో డిసెంబర్‌ 31 నుంచి ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఆఫ్‌లైన్‌ టోకెన్లు కూడా రోజుకు 5 వేల చొప్పున జారీ చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు.

జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.