SHAR : షార్‌లో 12 మందికి కరోనా
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా థర్డ్‌వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది.

Shar
SHAR : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా థర్డ్‌వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్‌కు పంపారు.
చదవండి : Corona Symptoms : జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలు ఏంటి? వైద్యనిపుణులు ఏమంటున్నారు?
కరోనా సోకినవారిలో కొందరు ఇళ్లనుంచి రాగా, మరికొందరు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. ఇంటికెళ్ళొచ్చిన వారికి కరోనా టెస్ట్‌లు తప్పనిసరిగా నిర్వహించాలని షార్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. షార్‌లో కరోనా కేసులు రావడంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు.
చదవండి : Corona : తెలంగాణ సచివాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్
ముందస్తు అనుమతితోనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని.. వచ్చిన తర్వాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. తర్వాతే విధులకు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక బయోమెట్రిక్ విధానాన్ని కూడా రద్దు చేశారు అధికారులు.. దీని స్థానంలో రిజిస్టర్ అటెండ్స్ తీసుకోవాలని తెలిపారు.