వ్యాక్సిన్ వికటించి ఇద్దరు మృతి

corona-vaccination
Two died after corona vaccination in telugu states : కరోనా వైరస్ సోకి చాలా మంది మృత్యువాత పడుతుంటే దాన్ని అడ్డుకోటానికి ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకువచ్చి ప్రజలకు వేస్తోంది. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న కొందరికి వికటించి మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఊభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది,
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వ్యాక్సినే వేయించుకుని ఒక వ్యక్తి మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుపతి మల్లంగుంట పంచాయతీ,రామానుజ పల్లి అంబేద్కర్ కాలనీకి చెందిన కృష్ణయ్య అనే శానిటరీ వర్కర్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
వ్యాక్సిన్ వేయించుకున్న 24 గంటల్లోనే అతను మరణించినచట్లు కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోవటం వల్లే మరణించాడని వారు తెలిపారు. కాగా… మరణించిన వ్యక్తి ఏ కారణం చేత మరణించాడో పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక తెలియచేస్తామని అదికారులు వెల్లడించారు.
మరో వైపు తెలంగాణ లోని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్ వాడి టీచర్ మృతి చెందడం కలకలం రేపుతోంది. జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడులోని అంగన్ వాడీ టీచర్ చిన్ని- నాలుగు రోజుల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్నారు.
అనంతరం ఆమె తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు, వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది.