విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

Updated On : January 28, 2021 / 11:46 AM IST

Two killed in road accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం సింగారమ్మ తల్లి ఆలయం సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో… ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గోకవరం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

తెల్లవారుజాము కావడంతో పాటు కారు అతివేగం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విద్యుత్ స్తంభం కారుపై పడటంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.