Undavalli Arun Kumar : కచ్చితంగా రాజకీయమే.. అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్
ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం కచ్చితంగా రాజకీయమే అని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

Undavalli Arun Kumar : బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆదివారం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. అమిత్, ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? వీరి భేటీ వెనుక రాజకీయ కోణం ఉందా? ప్రస్తుతం ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.
కాగా, షా-తారక్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రాధాన్యం లేనిదే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా అంత తీరికగా సమావేశమవుతారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపౌ స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు.
Kodali Nani Interesting Comments : అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం వెనుక కచ్చితంగా రాజకీయమే అని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.
”జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబుకి పడదని.. ఇవన్నీ స్టోరీలు నడుస్తున్న టైమ్ లో అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ కావడం ఆసక్తికర అంశమే. కచ్చితంగా ఎన్టీఆర్ కు పొలిటికల్ ఇంట్రస్ట్ ఉంది. 2009 ఎన్నికల్లో చాలా కష్టపడి తిరిగాడు. రెండు చోట్ల జనంలో కలిసిపోయి ఆయన స్పీచ్ నేను కూడా విన్నాను. మంచి ఎక్స్ ప్రెషన్ ఉంది. ఫేస్ కట్ సీనియర్ ఎన్టీఆర్ లా ఉంది. ఈ తరం వాళ్లు సీనియర్ ఎన్టీఆర్ ను మర్చిపోయి ఉండొచ్చు.
కానీ, మా తరం వాళ్లందరికీ సీనియర్ ఎన్టీఆర్ ఫేస్ జూనియర్ ఎన్టీఆర్ లో కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మీద పర్సనల్ గా నాకు మంచి అభిప్రాయం ఉంది. మర్యాద మనిషి, మేనర్స్ తెలిసిన మనిషి. బాగా మాట్లాడతాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ అగ్రనేత అమిత్ షా కలిశాడంటే కచ్చితంగా అది పాలిటిక్సే. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, వారి భేటీ మాత్రం కచ్చితంగా రాజకీయమే” అని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు.
“అమిత్ షా, ఎన్టీఆర్ కలయిక వెనుక రాజకీయమే అయి ఉండొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని బీజేపీ వినియోగించుకునే ఛాన్స్ కూడా ఉంది. తారక్‌కి అన్ని విషయాలపై అవగాహన ఉంది. ఎప్పుడెలా వ్యవహరించాలో ఆయనకు తెలుసు.