Tirupati : కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర..పూర్తి వివరాలు
మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’కు తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.

Kishan Reddy
Jana Aashirwad Yatra : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’కు తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. 2021, ఆగస్టు 19వ తేదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రులను పార్లమెంటులో పరిచయం చేసే అవకాశం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వారిని జనంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి మూడు రోజుల పాటు జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు.
Read More : Ex CM Chautala : పది పరీక్ష రాసిన మాజీ సీఎం
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ప్రతిపక్షాలను ఎండగట్టడం.. అజెండాగా దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. 2021, ఆగస్టు 19వ తేదీ గురువారం తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు కిషన్‌రెడ్డి. ఆ తర్వాత పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోడ్డు మార్గంలో తెలంగాణలోకి అడుగు పెడతారు. కోదాడ నుంచి ప్రారంభమై..శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయం వద్ద సభతో యాత్ర ముగియనుంది.
Read More : Mandalapatti : కమనీయ దృశ్యం, ఈ పువ్వులు 12 ఏళ్లకు ఒకేసారి పూస్తాయి
తెలంగాణలో నిర్వహించనున్న జన ఆశీర్వాద యాత్రలో భాగంగా 12 జిల్లాలు, 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా 324 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి పర్యటిస్తారు. కోదాడ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఆయనకు స్వాగత పలకనున్నారు. 20వ తేదీ ఉదయం సూర్యాపేట నుంచి జన ఆశీర్వాద యాత్ర కొనసాగిస్తారు కిషన్‌రెడ్డి. సూర్యాపేట నుంచి దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్‌కు చేరుకుంటారు. వరంగల్ నగరంలో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
Read More : Tuck Jagadish: తగ్గిన నానీ.. ఓటీటీలోనే టక్ జగదీష్!
వరంగల్‌లో వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించి.. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరును తెలుసుకోనున్నారు కిషన్‌రెడ్డి. అనంతరం సర్వాయి పాపన్న గ్రామం ఖిల్లాషాపూర్ నుంచి జనగామ వెళ్తారు. ఆలేరులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశాన్ని సన్మానిస్తారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు చేరుకుంటారు కిషన్‌రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామిని దర్శించుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
Read More : Crying Benefits : ఏడవటానికి సంకోచించొద్దు..ఏడిస్తే ఎన్ని ప్రయోజనాలో
21న ఉదయం యాదాద్రి నుంచి బయలుదేరి భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తారు. స్థానికంగా రేషన్ షాపులను సందర్శించి ప్రజలకు ఉచిత బియ్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకుంటారు. భువనగిరిలో రేషన్ షాప్‌ల సందర్శన తర్వాత ఘట్‌కేసర్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయనికి చేరుకుంటారు కిషన్‌రెడ్డి. అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.