Kishan Reddy : ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్…

ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Kishan Reddy : ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్…

Union Minister Kishan Reddy Comments On Ap Capitals

Updated On : November 22, 2021 / 1:44 PM IST

Kishan Reddy : ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు కిషన్ రెడ్డి. ప్రజల మనోభావాల ప్రకారం అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ రాజధానికి మద్దతు తెలిపిందని చెప్పారు. రైతులను దృష్టిలో పెట్టుకునే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు.. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది. బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో ధర్మాసనం చెప్పాలని సూచించింది. తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతోందో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని ఏజీ కోర్టుకు చెప్పారు. మూడు రాజధానుల బిల్లును మాత్రం ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు ఏపీ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2.15 గంటలకు తదుపరి విచారణ జరుగనుంది.

అసెంబ్లీలో సీఎం జగన్ చేసే ప్రకటనపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రాజధానిపై కొత్త బిల్లును ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కొత్త బిల్లులో కీలక అంశాలను ప్రభుత్వం పొందుపరుస్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వెల్లడించారు. దీనిపై కాసేపట్లో అసెంబ్లీలో అధికారికంగా సీఎం జగన్ ప్రకటించనున్నారు.

Read Also : Agricultural Laws : వ్యవసాయ చట్టాల రద్దు..కాంగ్రెస్ అప్పుడు ఏం చెప్పింది ? ఇప్పుడేం జరిగింది ?