వంశీ కౌంటర్ అటాక్ : రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

నేను రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వల్లభనేని వంశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వల్లభనేని చేస్తున్న కామెంట్స్ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటు కౌంటర్ ఇచ్చారు వంశీ. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాజకీయ బిక్ష పెట్టింది బాబు..నేనేమి కాదనలేదు కదా..కాంగ్రెస్ ఆయనకు బిక్ష పెట్టలేదా అని గుర్తు చేశారు.
తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ టీడీపీలో చేరలేదా అని ప్రశ్నించారు. తనను రాజీనామా చేయాలని లోకేష్ అంటున్నారని, అలాగే చేస్తానని కానీ అడ్డదారిలో తాను మంత్రి కాలేదన్నారు. ఎందుకు ఎమ్మెల్సీ పదవిని వెంట పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో ఓడిపోయిన వారు మాత్రం ఎమ్మెల్సీ పోస్టు ఎందుకు పెట్టుకుంటారు ? ప్రజల్లో గెలిచిన నేను ఎందుకు రాజీనామా చేయాలి ? అన్నారు. ఓడిపోయిన మీరు మీరెందుకు రాజీనామా చేయరని నిలదీశారు వంశీ.
సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో తనపై వార్తలు వస్తున్నారని, పార్టీ నుంచి వస్తున్నాయని తాను విషయం చెప్పడం జరిగిందని మరోసారి చెప్పారాయన. తమపై తప్పుడు దుష్ప్రచారం చేసే హక్కు లోకేష్ ఎవరికి ఇచ్చారన్నారు. తాను ఆవేశం పడిన మాట వాస్తవమన్నారు. తాను అడిగిన వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు బోధన చేయాలా ? వద్దా ? అని మరోసారి ప్రశ్నించారు వల్లభనేని.
Read More : మాటకు మాట : ఏం పేరు పెట్టాలో పవనే చెప్పాలి – కొడాలి నాని