అమెరికాలో బిజినెస్‌ యోచనలో వల్లభనేని వంశీ!

Vallabhaneni Vamsi: కేసుల భయమో.. చంద్రబాబుతో విభేదించిన తాను ఇక రాజకీయం చేయలేననో కారణంతో ఏకంగా విదేశాలకు..

అమెరికాలో బిజినెస్‌ యోచనలో వల్లభనేని వంశీ!

అది అసలే బెజవాడ.. ఫక్తు రాజకీయాలకు అడ్డా.. రాష్ట్ర రాజకీయాలకే రాజధానిగా పేరు.. అలాంటి చోట రాజకీయం చేయడమంటే మాటలా? అక్కడ నెగ్గితే దేశాన్నే ఏలిన ఫీలింగు. ఆ హీరోయిజంతోనే అంతా నా ఇష్టం అన్నట్లు రాజకీయం చేద్దాం అనుకున్నారు. ఎంత మాట నోటికొస్తే అంతనేసారు.. ఎస్… నేనంటే నేనే.. ఎవడరైనా సరే గన్నవరం తేల్చుకుందాం.. రండి అన్నట్లు రంకెలేశారు… మరి ఇప్పుడేం చేస్తున్నారు.. ఎక్కడున్నారు? ఓ వంశీ.. ఒక వల్లభనేని వంశీ స్టోరీయే ఇదే.. సాధారణ ఎమ్మెల్యే అయినా తన నోటి దురుసుతో పాపులర్ పొలిటీషన్‌గా గుర్తిండిపోయే రేంజ్‌కు ఎదిగిన వల్లభనేని ఎక్కడా అంటూ వెతుకుతున్నారు టీడీపీ క్యాడర్…

ఎవరి నెంబర్ ఎంతో?
ఒన్.. టూ… త్రీ… ఈ నెంబర్లేంటి అనుకుంటున్నారా? టీడీపీ క్యాడర్ కొందరు నేతలకు పెట్టిన ముద్దు పేర్లు… ముద్దు పేర్లు అంటారా? తమ టార్గెట్‌కు ఫిక్స్ చేసుకున్న నెంబర్లు అంటారో తెలియదు కానీ, ఎన్నికల తర్వాత కొందరు నేతల ఇళ్లమీదకు దాడులకు ప్రయత్నించారంటే…. ఆ లీడర్లపై పసుపు దళానికి ఎంత కోపం ఉందో తెలుస్తోంది.

మరి ఆ నెంబర్లలో ఎవరి నెంబర్ ఎంతో తెలియదు కానీ, ఈ మూడు నెంబర్లలో కచ్చితంగా ఓ నెంబర్ గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీదేనని గుంటూరు ఎన్టీఆర్ భవన్ వర్గాల టాక్. అధికారంలో ఉండగా దమ్ముంటే రండి.. అంటూ సవాల్ చేసిన వంశీ.. ఎన్నికల తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. తాను ఎక్కడున్నారో ఎవరికీ చెప్పలేదు. చివరికి తన అడ్డాగా చెప్పుకున్న గన్నవరంలోని క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు వంశీ.

టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ… రెండోసారి గెలిచిన తర్వాత పార్టీకి హ్యాండిచ్చారు. పార్టీ అధినాయకత్వంతో విభేదించి వెళ్లిపోయారంటే.. రాజకీయాల్లో కామనే అని సరిపెట్టుకోవచ్చు. అందరిలా అలా సైలెంట్‌గా వెళ్లిపోతే.. తాను వల్లభనేని వంశీ ఎందుకవుతాను అనుకున్నారేమో… అధినేత చంద్రబాబుపైనా… యువనేత లోకేశ్‌పైనా ఓ రేంజ్‌లో నోరు పారేసుకున్నారు. మాటలతోనే తాను వైలెంట్‌ లీడర్‌న్న బిల్డప్‌ బుల్డు చేసుకున్నారు.

సందర్భం వచ్చినప్పుడు ఒకసారి… సందర్భం కల్పించుకుని మరోసారి… అవసరం ఉన్నా.. లేకపోయినా విరుచుకుపడటమే వల్లభనేని తీరుగా మారిపోయింది. తన మాటలతో చంద్రబాబును అసెంబ్లీలో కంట తడి పెట్టించుకునేలా చేశారు. వంశీ మాటలకు తీవ్రంగా హర్ట్‌ అయిన చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడాన్ని ఇప్పటికీ టీడీపీ క్యాడర్‌ మరచిపోవడం లేదంటే… ఆ ఇన్సిడెంట్‌ ఎంత తీవ్రంగా ప్రభావం చూపిందో తెలుస్తోంది. వంశీ వ్యాఖ్యల వల్లే చంద్రబాబు శపథం చేసి మరీ సీఎం అయ్యారు కానీ, మాట తూలిన వంశీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. సుమారు 36 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఎక్కడా కనిపించడం లేదు
ఇలా ఓడిన తర్వాత గన్నవరంలో ఎక్కడా కనిపించడం లేదు వంశీ. గన్నవరం ఏంటి ఏపీలోనే ఆయన ఆచూకీ లేనట్లు చెబుతున్నారు. అమెరికా వెళ్లారా? హైదరాబాద్లో ఉన్నారో? కూడా తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయవాడలో వంశీ ఇంటిపైకి దాడికి వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా, బయటకు రాలేదు వంశీ.

ఎప్పుడూ దూకుడుగా ఉండే వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత బాగా డీలా పడిపోయారంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఫలితాలకు ముందే తన పరాజయంపై ఓ అంచనాకు వచ్చేసిన వంశీ… రాజకీయాలకు దూరమవుతున్నట్లు సంకేతాలిచ్చారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు సతీమణి పోటీ చేస్తారని ఎన్నికలకు ముందు స్వయంగా చెప్పారు వంశీ.

ఇదంతా ఒక ఎత్తso… కేసుల భయమో.. చంద్రబాబుతో విభేదించిన తాను ఇక రాజకీయం చేయలేననో కారణంతో ఏకంగా విదేశాలకు మకాం మార్చాలని వంశీ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఎన్నికల జరిగిన మే నెలలోనే పిల్లలను చూడటానికి అని వంశీ అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఈబీ 5 వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అమెరికాలో ఓ వాణిజ్య సంస్థలో సుమారు 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేవారికి ఈబీ 5 వీసా జారీ చేస్తారట… అమెరికాలో నివసించే విదేశీయులకు ఇచ్చే గ్రీన్‌ కార్డు కోసం ఈబీ 5 వీసాను దగ్గర దారిగా చెబుతారు. ఈ వీసా కోసం ప్రయత్నిస్తున్న వంశీ రెండు సంస్థల్లో సుమారు 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపిస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఇందులో నిజం ఉందో లేదో కానీ, వంశీ మాత్రం ఎన్నికల తర్వాత బయటకు కనిపించకపోవడంపైనే పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత చర్చ జరుగుతోంది.

AP CM Chandrababu : ఐదేళ్లు ఏపీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తాం : సీఎం చంద్రబాబు