Vangaveeti Radha : దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ప్రజల గుండెల్లో ఉండిపోయారు.. వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో రాధా

ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికి ప్రజల గుండెల్లో ఉండిపోయారని రాధా అన్నారు. రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా రాజుపాలెంలో..

Vangaveeti Radha : దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ప్రజల గుండెల్లో ఉండిపోయారు.. వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో రాధా

Vangaveeti Radha

Updated On : January 7, 2022 / 8:51 PM IST

Vangaveeti Radha : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో దివంగత వంగవీటి రంగా విగ్రహాన్ని ఆయన కుమారుడు, టీడీపీ నేత వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాధా.. అన్ని పార్టీల నాయకులు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. రంగా అభిమానానికి ప్రాంతాలు సరిహద్దులు అంటూ లేవన్నారు. రంగాను కొంతమంది మా నుండి భౌతికంగా దూరం చేశారు.. మరికొందరు ఆయన పేరును ప్రజల హృదయాల్లో తుడిచి వేయాలని చూశారని రాధా ఆరోపించారు. అయినా నేటికి ప్రజల్లో రంగాపై అభిమానం తగ్గలేదన్నారు.

Railway Platform Ticket : సంకాంత్రి ఎఫెక్ట్.. రైలు ప్రయాణికులకు షాక్.. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు

ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికి ప్రజల గుండెల్లో ఉండిపోయారని రాధా అన్నారు. రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా రాజుపాలెంలో నేడు విగ్రహం ఏర్పాటు చేశారంటే ఆయనకు ప్రజల్లో ఎంతటి అభిమానం ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. కేవలం 41 సంవత్సరాల వయస్సులోనే రంగా పేదల గుండెచప్పుడు చాటి చెప్పారని, కాబట్టే నేటికి ప్రతీ పేద గుండెలో నిలిచి పోయారని రాధా అన్నారు.

Jio Users : జియో యూజర్లు రీచార్జీ తేదీ మరిచిపోయారా? నో ప్రాబ్లమ్

నాతో పాటు రాబోయే తరాలకు రంగా ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. రంగాపై ఎంత అభిమానం చూపించారో అదే అభిమానంతో ఆయన ఆశయాల కోసం అందరూ ఒకరికొకరు అండగా ఉంటూ ఐక్యంగా ముందుగు సాగుతూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు వంగవీటి రాధా.