Vellampalli Srinivas: ఏపీ ఎన్నికల్లో సీటు మార్పు ప్రచారంపై వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తాను, మేయర్ కలిసి రెండు రోజులు క్రితం వెళ్లామని అన్నారు.

Vellampalli Srinivas
YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైఎస్సార్సీపీలో కొందరి సీట్లను మార్చే అవకాశం ఉందంటూ, కొందరిని పక్కన పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆయా నేతలు స్పందించాల్సి వస్తోంది. తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.
అమరావతిలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలను నమ్మొద్దని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తాను, మేయర్ కలిసి రెండు రోజుల క్రితం వెళ్లామని అన్నారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం ప్రస్తావించలేదని తెలిపారు.
తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనను విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారంటూ ప్రచారం జరుగుతోందని అందులో వాస్తవం లేదన్నారు. అలాగే, తాను పార్టీకి రాజీనామా చేశానని కూడా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఎన్నికలకు దూరంగా వసంత కృష్ణ ప్రసాద్?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని ఇప్పటికే ఆయనకు అధిష్ఠానం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం సీఎంను కలిశారు వసంత కుమార్. ఇవాళ తాడేపల్లికి రావాలని వసంత కుమార్‌ను పిలిచినా ఆయన రాలేదని తెలుస్తోంది.
Minister Roja : జగన్ ఫోటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు- మంత్రి రోజా