Posani Krishna Murali : త్వరలోనే కళాకారులకు ఐడీ కార్డులు, అల్లు అర్జున్ నాకు 5లక్షలు ఇచ్చారు- పోసాని కృష్ణమురళి

కళాకారుల లిస్ట్ మొత్తం రెడీ అయితే షూటింగ్ లకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. Posani Krishna Murali - ID Cards

Posani Krishna Murali : త్వరలోనే కళాకారులకు ఐడీ కార్డులు, అల్లు అర్జున్ నాకు 5లక్షలు ఇచ్చారు- పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali (Photo : Google)

Updated On : August 30, 2023 / 5:48 PM IST

Posani Krishna Murali – ID Cards : సినీ నటుడు, ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. నాటకాలకు 115, ఉత్తమ పుస్తకాల క్యాటగిరీలో 3 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు స్క్రూటినీ జరుగుతుందన్నారు. 19వ తేదీ వరకు అవార్డులు ప్రకటన చేస్తామన్నారు. అవార్డుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని పోసాని తేల్చి చెప్పారు. నాటకాలకు అందిన దరఖాస్తుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Also Read: అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ.. భారీ మెజార్టీ ఖాయమా?

ఇక, త్వరలోనే ఏపీలో ఉన్న నటులు, ఫైటర్లు, సంగీత దర్శకులు ఇతర కళాకారులకు ఐడెంటిటీ కార్డులు ఇస్తామన్నారు పోసాని కృష్ణమురళి. కళాకారులకు ఇవ్వాల్సిన రాయితీలపైనా త్వరలో దృష్టి పెడతామన్నారాయన. ఏపీలో ఉన్న కళాకారులు అందరినీ ఒకేతాటిపైకి తెచ్చి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుందని పోసాని తెలిపారు. కళాకారుల లిస్ట్ మొత్తం రెడీ అయితే షూటింగ్ లకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. చాలామంది కళాకారులు దళారుల చేతిలో పడి ఇబ్బందులు పడుతున్నారని పోసాని కృష్ణమురళి వాపోయారు. కళాకారుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Also Read: రోజాకు ఆ ఐదుగురితో విభేదాలు.. వారికి మంత్రి పెద్దిరెడ్డి అండదండలు!

హీరో అల్లు అర్జున్ నాకు మంచి మిత్రుడు అని పోసాని చెప్పారు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లౌక్యం తెలిసిన మనిషి అల్లు అర్జున్ అని ఆయన చెప్పారు. ఒకసారి నన్ను ఇంటికి పిలిచి అల్లు అర్జున్ 5లక్షల చెక్ ఇచ్చారని పోసాని వెల్లడించారు. ముగ్గురు పేద పిల్లల చదువు కోసం అల్లు అర్జున్ ఇచ్చారని చెప్పి ఆ డబ్బు ఇచ్చేశానని పోసాని పేర్కొన్నారు.