Neelakantapuram : ఆధ్యాత్మికతను పంచండి… గ్రామస్థులకు ఉపరాష్ట్రపతి లేఖ

నీలకంఠాపురంలో 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణతోపాటు పలు ఆలయాలను నూతనంగా నిర్మించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఆలయనిర్మాణాలను పూర్తి చేశారు.

Neelakantapuram : ఆధ్యాత్మికతను పంచండి… గ్రామస్థులకు ఉపరాష్ట్రపతి లేఖ

Vice President Venkaiah Naidu Writes Letter To Neelakantapuram Villagers

Updated On : June 16, 2021 / 11:36 AM IST

Vice President Venkaiah Naidu : నీలకంఠాపురంలో 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణతోపాటు పలు ఆలయాలను నూతనంగా నిర్మించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఆలయనిర్మాణాలను పూర్తి చేశారు.

ఆలయాల ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈనెల 19 నుంచి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నీలకంఠాపురం గ్రామస్థులకు లేఖ రాశారు.

ఆత్మకు దేహం ఆలయమైనట్లే ఇంటికి పూజా మందిరం, ఊరికి దేవాలయం అంతే ప్రధానం. దేవాలయాల్లో దేవుడు మాత్రమే కాకుండా మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం, పురాణాలు సంగమంగా వర్ధిల్లుతాయని’ లేఖలో పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఆధ్యాత్మికతను పంచాలని ఆకాంక్షిస్తూ నీలకంఠాపురం గ్రామ ప్రజలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Read:TDP Protest : కొవిడ్ బాధితులను ఆదుకోవాలి.. రాష్టవ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపు