TDP Protest : కొవిడ్ బాధితులను ఆదుకోవాలి.. రాష్టవ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపు

కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన బాట పట్టింది. 10 డిమాండ్‌లతో బుధవారం (జూన్ 16) నుంచి నాలుగురోజుల పాటు టీడీపీ నిరసనలు చేపట్టనుంది.

TDP Protest : కొవిడ్ బాధితులను ఆదుకోవాలి.. రాష్టవ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపు

Tdp Holds Statewide Protests For Covid 19 Victims With 10 Demands

TDP Statewide Protests : కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన బాట పట్టింది. 10 డిమాండ్‌లతో బుధవారం (జూన్ 16) నుంచి నాలుగురోజుల పాటు టీడీపీ నిరసనలు చేపట్టనుంది. జూన్ 16, 18, 20, 22 తేదీల్లో రాష్ట్రావ్యాప్త నిరసనలకు టీడీపీ ఆధిష్టానం పిలుపునిచ్చింది. కరోనా మృతులకు పది లక్షలు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు పదివేలు ఇవ్వాలంటూ నిరసనలు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

రైతుల పంటలు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది. జర్నలిస్ట్‌లను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి బీమా కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్ధిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పేదలకు కష్టకాలంలో ఆసరాగా నిలిచే అన్న క్యాంటీన్‌లు పున:ప్రారంభించాలన్న డిమాండ్‌లతో టీడీపీ నిరసనలను ఉధృతం చేయనుంది.

ఆయా అంశాలపై నిరసనలు-16న తహసీల్దార్, 18న ఆర్డీవో, 20న కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపనలు , 22న అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టనుంది. తొలి రోజు నిరసనలో భాగంగా మొదటి రోజున తాహసీల్దార్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాల అందజేయనుంది.