Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని చంద్రబాబును జడ్జి అడిగారు. చంద్రబాబు స్పందిస్తూ తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు.

Chandrababu Naidu
Skill development case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రిమాండ్‌నుఏసీబీ కోర్టు నవంబర్ 1 వరకు పొడిగించింది. అంతకుముందు చంద్రబాబును వర్చువల్‌గా పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
వాదనల సమయంలో చంద్రబాబు పలు విషయాలు చెప్పారు. తన భద్రత విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. అయితే, ఏమైనా అనుమానాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులకు ఆదేశించారు.
అలాగే, స్కిల్ డెవలప్మెంట్ కేసు హైకోర్టులో పెండింగులో ఉందని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను ఎప్పటికప్పుడు కోర్టుకు అందించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని చంద్రబాబును జడ్జి అడిగారు. చంద్రబాబు స్పందిస్తూ తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు.
ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకొవాలని అధికారులకు జడ్జి సూచించారు.
YS Sharmila: చిన్నదొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? ఇన్ని డ్రామాలు ఓట్లకోసమే కదా