Vijayawada Girl Case : విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. అశ్రునయనాలతో అంత్యక్రియలు
9వ తరగతి బాలిక అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితుడు వినోద్ జైన్ ను తక్షణమే కఠినంగా శిక్షించాలని..

Vijayawada Girl Case
Vijayawada Girl Case : లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విజయవాడ బాలిక మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు భవానీపురంలోని కుమ్మరిపాలెం సెంటర్ లోని అపార్ట్ మెంట్ కు బాలిక మృతదేహాన్ని తీసుకొచ్చారు. బాలిక మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కేసులో నిందితుడు వినోద్ జైన్ ను తక్షణమే కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించవచ్చా?…
బాలిక అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ నగరంలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్ వద్ద గల ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. తనను ఓ వ్యక్తి కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని నోట్ బుక్‌లో రాసిన బాలిక.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరగడం సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు తెలిపారు. నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.
టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాలిక మృతికి ముందు సూసైడ్ నోట్ రాసింది. నోట్ ఆధారంగా పోలీసులు వినోద్ పై పోక్సో కేసు నమోదు నమోదు చేసి అరెస్ట్ చేశారు.