ఆదుకోండి బాబు గారూ.. లేకపోతే లావైపోతారు

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి సెటైర్ వేశారు. ఈ సారి శ్రీమంతుడు సినిమాలో మహేశ్ స్టైల్‌లో సెటైరికల్‌గా వరద బాధితులకు సాయం చేయమని కోరారు. ఇసుక దందాలో సంపాదించిన డబ్బు ఇప్పటికైనా బాధితులకు ఇవ్వండి లేకపోతే లావైపోతారని కామెంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని, లోకేశ్‌ను, చంద్రబాబును అందులో ట్యాగ్ చేశారు.
శుక్రవారం చేసిన ట్వీట్లలో ‘ఎన్టీఆర్-కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరింత పతనమవుతున్నాడు’ అని ఒక ట్వీట్ చేసి.. కాసేపటికే మరో ట్వీట్‌తో సెటైర్ వేశారు.
‘వరదలొచ్చిన ప్రతిసారి వేల మంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ, పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ చంద్రబాబుకు వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి బాబు గారు. లేక పోతే లావై పోతారు’ అని వ్యంగ్యంగా చంద్రబాబుపై కామెంట్ చేశారు.
వరదలొచ్చిన ప్రతిసారి వేల మంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ,పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ @ncbn గారికి వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి బాబు గారు. లేక పోతే లావై పోతారు. @JaiTDP @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2019
ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో @AndhraPradeshCM గారు దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో ఈయన మరింత పతనమవుతున్నాడు. @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2019