ప్రేమ విఫలమవ్వటమే ఆత్మహత్యకు కారణం

village secretariat employees commits suicide in nellore district : నెల్లూరు జిల్లా శివారులో జరిగిని సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్యకేసులో ప్రేమ విఫలమవటమే కారణమని తెలుస్తోంది. ప్రేమ విఫలమై ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకోవటంతో కలిసి జీవించలేమనే బాధతో ఇద్దరూల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హరీష్, లావణ్యలకు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు వచ్చేనాటికి ఇద్దరూ అవివాహితులే. లావణ్య నాయుడుపేట నుండి హరీష్ నెల్లూరు నుండి ఉద్యోగరీత్యా మెట్టు సచివాలయం కు వచ్చేవారు.
లావణ్య మెట్టు సచివాలయ వీఆర్వో గానూ, హరీష్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గాను ఉద్యోగరీత్యా మెట్టుకు వచ్చిన తర్వాత వీరిద్దరూ ప్రేమికులయ్యారు. వీరిద్దరి ప్రవర్తన మరియు పనితీరుపై స్థానికులు మరియు తోటి ఉద్యోగులు మండల ప్రజలు మంచివారుగా చెప్పు కొస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఇరువురుకు వేరు వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి.
హరీష్ వాళ్ల మరదలిని, లావణ్య సైదాపురం డిజిటల్ అసిస్టెంట్ ను వివాహం చేసుకున్నట్లు సమాచారం . కాగా శుక్రవారం ఇద్దరూ కలిసి పడారుపల్లి శివార్లలోని ఓ లాడ్జీలో ఒకే తాడుకు ఉరివేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వేదాయపాళెం పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.