Tirumala : తిరుమలకు 35 మంది జడ్జీలతోపాటు మంత్రులు, ఎమ్మేల్యేలు రాక.. వసతి గదుల కోసం టీటీడీపై పెరుగుతున్న ఒత్తిడి

సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

Tirumala : తిరుమలకు 35 మంది జడ్జీలతోపాటు మంత్రులు, ఎమ్మేల్యేలు రాక.. వసతి గదుల కోసం టీటీడీపై పెరుగుతున్న ఒత్తిడి

Tirumala Vaikuntha Ekadashi Rush

VIPs Visit Tirumala : తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఏడు మంది, ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది జడ్జీలు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ తిరుమల చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలకు మరో 12 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ రానున్నారు. దీంతో ఐదు మంది టీటీడీ పాలకమండలి సభ్యులు తిరుమలోనే మకాం వేశారు.

రాత్రికి మరో 18 మంది పాలకమండలి సభ్యులు తిరుమలకు చేరుకోనున్నారు. తిరుమలకు ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక రిసెప్షన్ అధికార్లు తలలు పట్టుకుంటున్నారు. వసతి గదులు కోసం టీటీడీపై ఒత్తిడి పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది.

Covid-19 In India : దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను మహమ్మారి కలవరం

ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూ లైనులో ఉన్న భక్తులుకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది. సర్వదర్శన క్యూలైనులోకి భక్తులను అనుమతించడాన్ని టీటీడీ నిలిపివేసింది.

మరోవైపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి జనవరి 1వరకు దాదాపు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం జరుగనుంది. ఇందుకోసం రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విక్రయించింది. ఇప్పటివరకు 2 లక్షల 25 వేల టికెట్లను విక్రయించింది.

ఏపీలో బీజేపీ ఏం చేయబోతోంది.. టీడీపీ-జనసేనతో కలుస్తుందా?

ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఇందుకు కోసం తిరుమల, తిరుపతిలో దాదాపు పది కేంద్రాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 4 లక్షల 23 వేల 500 టోకెన్లు జారీ చేయనుంది. ఇక స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ లో ఒక టోకెన్ కేంద్రం ఏర్పాటు చేసింది. సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి నుంచి టీటీడీ జారీ చేస్తోంది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలుగు సేన పార్టీ ధర్నా

ఏకాదశి, ద్వాదశి టోకెన్లు జారీ పూర్తైంది. వైకుంఠ ఏకాదశి దర్శనం, ద్వాదశి దర్శనం టోకెన్ల జారీని టీటీడీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభించింది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది. అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ పూర్తైంది. డిసెంబర్ 23, 24వ తేదీ టోకెన్లు జారీ పూర్తి అయింది. ప్రస్తుతం 25వ తేదీకి సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత, చలికి గజగజ వణుకుతున్న విశాఖ మన్యం

సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్నటి నుండే కేంద్రాల వద్ద భక్తులు నిరీక్షించారు. టోకెన్ల కోసం నిన్నటి నుండే కేంద్రాల వద్ద భక్తులు తిరుమల కొండపై భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి టోకెన్ల కోసం క్యూలైన్ లో నిరీక్షించారు. ఇక రేపటి నుంచి పది రోజులపాటు దర్శనం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.