Vande Bharat Express Cancel : విశాఖ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రద్దు.. ప్రత్యామ్నాయంగా మరో రైలు ఏర్పాటు
ఈ నేపథ్యంలో ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆయా రైల్వే స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని సూచించారు.

Visakha - Secunderabad Vande Bharat Express
Visakha – Secunderabad Vande Bharat Express Cancel : విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం 5:45గంటలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దు చేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్ స్టాపుల్లోనే ఆగుతుందని వెల్లడించారు.
ప్రత్యామ్నాయ రైలు ఉదయం 7గంటలకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆయా రైల్వే స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని సూచించారు.
Vande Bharat trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త
వందేభారత్ రైలుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ రైలు ఎక్కాలని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 20833 నెంబర్ తో, సికింద్రాబాద్ నుంచి విశాఖకు 20834 నెంబర్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తోంది.
ప్రతిరోజు ఉదయం 5:45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. అయితే, ఆదివారం ఈ సర్వీసు అందుబాటులో ఉండదు.