Visakha Swamiji Case : విశాఖ స్వామిజీ కేసు.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు
Visakha Swamiji Case : బాలికపై అత్యాచారానికి సంబంధించి ఆశ్రమం నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

Visakha Swamiji Case
Visakha Swamiji Arrest : ఏపీలో సంచలనం రేపిన విశాఖ స్వామిజీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. సాక్ష్యాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్వామిజీ యత్నించారని పోలీసులు వెల్లడించారు. స్వామిజీ ఆశ్రమం నుంచి 12మందిని బాల సంరక్షణ గృహానికి అధికారులు తరలించారు. ఆశ్రమానికి వచ్చిన దిశ ఏసీపీ వివేకానంద బాలికల నుంచి వివరాలు సేకరించారు.
ఈ నెల 13న ఆశ్రమం నుంచి ఒక బాలిక బయటకు వచ్చింది. కృష్ణా జిల్లాలో ఆ బాలికకు సంబంధించి వివరాలు సేకరించిన పోలీసులు.. విశాఖలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు.
బాలికపై అత్యాచారానికి సంబంధించి ఆశ్రమం నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఉదయం నుంచి బాలికలను విచారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. ఆశ్రమంలో నివాసం ఉండేందుకు కనీస సౌకర్యాలు లేవని గుర్తించారు. బాలిక చెప్పిన వివరాలను బట్టి అత్యాచారం జరిగింది అనడానికి ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. గతంలో అంటే 2012లోనూ స్వామిజీపై అత్యాచారం కేసు నమోదైంది. అయితే, ఒక డాక్టర్ సర్టిఫికెట్ ద్వారా ఆయన బయటపడ్డారు. దాంతో ఈ కేసును కొట్టివేశారు. తాజాగా పరిణామంతో అప్పటి కేసుని, ఇప్పుడు నమోదైన కేసుని.. రెండింటిని విచారిస్తున్నారు పోలీసులు.
అసలేం జరిగిందంటే..
విశాఖలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామిజీపై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండేళ్లుగా స్వామిజీ తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ బాలిక ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. స్వామిజీ చేతిలో చిత్రహింసలు అభవించానని 15ఏళ్ల బాలిక వాపోయింది. ఆశ్రమంలో పనిచేసే పని మనిషి సాయంతో తాను తప్పించుకున్నానంది. జ్ఞానానంద ఆశ్రమంలో సరస్వతీ స్వామిజీ తనను గొలుసులతో బంధించి, హింసించి అత్యాచారం చేసేవాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read..London : మరణానికి ముందు చాలామంది 5 అంశాల్లో పశ్చాత్తాప పడుతున్నారట
ఈ నెల 13న బాలిక ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసింది. ఈ నెల 15వ తేదీన బాధిత బాలిక కనిపించడం లేదంటూ ఆశ్రమానికి చెందిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికే.. స్వామిజీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ విజయవాడ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖలోని ఆశ్రమం నుంచి తప్పించుకుని రైలు ఎక్కిన బాలికకు ఓ మహిళ కుటుంబం పరిచయం అయ్యింది. ఆ కుటుంబం సాయంతోనే విజయవాడ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.