Visakha Purnananda Swamy Arrest : బాలికను గొలుసులతో బంధించి రెండేళ్లుగా స్వామిజీ అత్యాచారం .. అరెస్ట్ చేసిన పోలీసులు

రెండేళ్లుగా స్వామిజీ తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ బాలిక విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామీజీపై ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. స్వామీజి చేతిలో చిత్రహింసలు అభవించానని.. అత్యాచారాలకు గురి అయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Visakha Purnananda Swamy Arrest : బాలికను గొలుసులతో బంధించి రెండేళ్లుగా స్వామిజీ అత్యాచారం .. అరెస్ట్ చేసిన పోలీసులు

Police Arrested Swamy Poornananda Saraswathi

Updated On : June 20, 2023 / 11:09 AM IST

Visakha Purnananda Swamy Arrested : రెండేళ్లుగా స్వామిజీ తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ బాలిక విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామీజీపై ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. స్వామీజి చేతిలో చిత్రహింసలు అభవించానని.. అత్యాచారాలకు గురి అయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశ్రమంలో పనిచేసే పనిమనిషి సహాయంతో తప్పించుకున్నానని 15 ఏళ్ల బాలిక  జ్ఞానానంద ఆశ్రమంలో సరస్వతీ స్వామీజీ తనను గొలుసులతో బంధించి హింసించి అత్యాచారం చేసేవాడంటూ ఫిర్యాదు చేసింది.

గొసులలో రూములో బంధించి రెండేళ్లుగా స్వామీజీ 15 ఏళ్ల బాలికపై అత్యంత అమానవీయంగా అత్యాచారం చేసేవాడని తెలపింది. కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వాష్ రూముకు కూడా వెళ్లనీయకుండా దారుణంగా హింసించి అత్యాచారం చేసేవాడని బాధిత బాలిక చెబుతున్న విషయంలో హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామీజీ 15 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా అత్యాచారాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది ఆ బాలిక. ఓ రోజు ఆమె తప్పించుకుని ఓ కుటుంబం సహాయంతో విజవాడ దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో పూర్ణానంద సరస్వతీ స్వామీజీ దారుణాలు బయటపడ్డాయి. బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామీజీని అరెస్ట్ చేశారు.

Madhya Pradesh : ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట దారుణ హత్య.. మృతదేహాలను మొసళ్లున్న నదిలో పారవేత

చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రాజమండ్రికి చెందిన బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తరువాత రెండేళ్ల క్రితం విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. ఆ బాలికతో స్వామీజీ పశువుల కొట్టంలో పనిచేయించేవాడు. రాత్రుళ్లు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. అలా రెండేళ్లుగా బాలికను తన గదిలోనే ఇనుమ గొలుసులతో బంధించి అత్యాచారానికి పాల్పడేవాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. కడుపునిండా ఏనాడు అన్నం పెట్టలేదని ఆ బాలిక వాయపోయింది. కనీసం గుప్పెడు మెతుకులు కూడా పెట్టకపోవటంతో ఆకలితో అలమటించిపోయేదాన్ని అనీ కనీసం బాత్రూమ్ కు వెళ్లాలన్నా వెళ్లనిచ్చేవాడు కాదని ..ఓ బకెట్టు ఇచ్చి దాంట్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలని నిర్భంధించేవాడని చెప్పుకుని వాపోయింది. వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవాడని పోలీసులకు బాలిక తెలిపింది. దీంతో వివజయవాడ దిశ పీఎస్ పోలీసులు ఈకేసును విశాఖ పోలీసులకు బదిలిచేశారు. దీంతో విశాఖ ఎంవీపీ పోలీసులు కలిసి స్వామీజీని అరెస్ట్ చేశారు.

అనంతరం ఆశ్రమంలో మిగిలిని బాలికను విచారిస్తున్నారు. గత 15తేదీన బాధిత బాలిక కనిపించట్లేదు అంటూ ఆశ్రమానికి చెందిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికే తనపై స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ విజయవాడ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖలోని ఆశ్రమం నుంచి తప్పించుకుని రైలు ఎక్కి రైలులో పరిచయం అయిన ఓ మహిళ కుటుంబ సహాయంతో విజయవాడ వెళ్లి పోలీసులకుఫిర్యాదు చేసింది.

Crime News: గర్ల్ ఫ్రెండ్‌తో ఆటోలో వెళ్తూ అందులోనే ఆమెను చంపేసిన యువకుడు

ఆశ్రమంనుంచి ఓ పనిమనిషి సహాయంతో బాధిత బాలిక తప్పించుకని విశాఖలో తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. ఆ రైలులో బాలికను చూసిన ఓ మహిళ అలా ఉన్నావేంటీ..? అని ఆప్యాయంగా అడిగింది. దీంతో బాలిక తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుంది. ఆమె కథ విన్న సదరు మహిళ..ఆమె కుటుంబ ఆబాలికను అక్కున చేర్చుకున్నారు. తమతో పాటు విజయవాడ తీసుకెళ్లారు. బాలిక కాస్త తేరుకున్నాక రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసుల నుంచి లేఖ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటామని హాస్టల నిర్వాహకులు చెప్పారు. దీంతో కంకిపాడు దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులు ఇచ్చిన అనుమతి లేఖను తీసుకున్నారు.

అక్కడి నుంచి బాలికను తీసుకుని బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి వెళ్లింది. ఆశ్రమంలో తాను అనుభవించిన నరకం గురించి బాలిక చెప్పుకొచ్చింది. అదివిని నిర్ఘాంతపోయిన వారు బాలికతో కలిసి విజయవాడ దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై స్వామీజీని గత అర్ధరాత్రి విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.

Delhi RK puram : ఢిల్లీలో ఇద్దరు మహిళలు దారుణ హత్య

కానీ తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని బాలిక చెప్పినవన్నీ అబద్దాలు అంటూ స్వామీజీ కొట్టిపారేశారు. తనపై కుట్ర చేసి బాలికతో ఆరోపణలు చేయిస్తున్నారని స్వామీజీ ఆరోపిస్తున్నారు. ఆశ్రమానాకి చెందిన భూముల్ని దోచేయటానికి ఇటువంటి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.