Crime News: గర్ల్ ఫ్రెండ్‌తో ఆటోలో వెళ్తూ అందులోనే ఆమెను చంపేసిన యువకుడు
తీవ్ర గాయాలతో ఆమె ఆటో నుంచి దిగి పరిగెత్తడానికి ప్రయత్నించిందని, అయితే, అక్కడే కళ్లు తిరిగి పడిపోయి, మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

Crime News
Crime News – Mumbai : ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆటోలో వెళ్తున్నాడు. వారిద్దరూ అందులోనే గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి హత్యచేశాడు. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలో ఈ హత్య ఉదంతం కలకలం రేపుతోంది.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. సాకి నాకా ప్రాంతంలోని ఖైరానీ రోడ్డు మీదుగా ఆ ప్రేమికులు ఆటోలో వెళ్లారని అన్నారు. ప్రియురాలి గొంతు కోసిన వ్యక్తి పేరు పంచశిల అశోక్ జామ్డాగా గుర్తించామని చెప్పారు.
హత్య చేసిన అనంతరం అతడు ఆటోదిగి పారిపోయాడని వివరించారు. మృతిరాలి పేరు పంచ్‌శిల జామ్దార్ అని గుర్తించినట్లు వివరించారు. తీవ్ర గాయాలతో ఆమె ఆటో నుంచి దిగి పరిగెత్తడానికి ప్రయత్నించిందని, అయితే, అక్కడే కళ్లు తిరిగి పడిపోయి, మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్టు చేశామని చెప్పారు. ప్రియురాలిని హత్య చేయడానికి ఆ యువకుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యువకుడి వద్ద కత్తి ఎందుకు ఉంది? అన్న విషయం
Viral Video: రెస్టారెంటులో అందరూ చూస్తుండగా సిబ్బంది, ఓ కుటుంబం తన్నులాట.. ఎందుకంటే?