Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident

Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

Vizianagaram Train Accident Help Line Numbers

Updated On : October 30, 2023 / 8:45 AM IST

Vizianagaram Train Accident Help Line Numbers : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం(అక్టోబర్ 29) రాత్రి రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు

హెల్ప్ లైన్ నెంబర్లు
0891 2746330
0891 2744619

ఎయిర్ టెల్
81060 53051
81060 53052

బీఎస్ ఎన్ ఎల్
8500041670
8500041671

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-చినరావుపల్లి దగ్గర రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నంబర్స్ ను ఏర్పాటు చేశారు.

1. కేజీహెచ్ casuality No.8912558494
2. డాక్టర్ @ కేజీహెచ్ మొబైల్ నెంబర్ 8341483151
3. డాక్టర్ @ కేజీహెచ్ casuality మొబైల్ నెం.8688321986

బాధితుల వైద్య సాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు.

Vizianagaram Trian Accident Help Line Numbers

Vizianagaram Trian Accident Help Line Numbers