Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం

పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.

Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం

Vizianagaram Train Accident (1)

Updated On : October 30, 2023 / 10:35 AM IST

Vizianagaram Train Accident – Union Govt Exgratia : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, మరో 100 మందికి గాయాలు అయ్యాయి. రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు ప్రకటించింది.

పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 100 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదంలో లోకో పైలెట్, రైలు గార్డు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 7 బోగీలు ధ్వంసం అయ్యాయి.

vizianagaram Train Accident : రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఘటన స్థలిని పరిశీలించనున్న సీఎం జగన్

రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఏపీ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

విజయనగరం జిల్లాలో ఆదివారం (అక్టోబర్29,2023) రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ ను వెనుక నుంచి పలాస-విశాఖ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నిల్ కోసం ఆగిన ప్యాసింజర్ ను పలాస-విశాఖ ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో పలాస ప్యాసింజర్ కు చెందిన 5 బోగీలు పట్టాలు తప్పాయి.

Vizianagaram Train Accident : రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే..

ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖ మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. 15 రైళ్లను దారి మళ్లించగా, మరో ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. బాలేశ్వర్ ప్రమాదం తరహాలోనే సిగ్నల్ సమస్య తలెత్తింది. ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఘటనాస్థంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.