VMRDA చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు కన్నుమూత

Dronam Raju Srinivas : VMRDA చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ద్రోణంరాజు మృతిచెందారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నాక కూడా ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడాయి.
కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ద్రోణంరాజు ఆరోగ్యం మరింత విషమించి మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విశాఖ దక్షిణం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు. వీఎంఆర్డీఏ తొలి చైర్మన్ గా కూడా ద్రోణం పనిచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు.. తండ్రి బాటలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 319 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత ఆయనకు సీఎం జగన్ వీఎంఆర్డీఏ చైర్మన్ కీలక పదవిని ఇచ్చారు. ప్రజల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం 3 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.