వైసీపీ అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.

వైసీపీ అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి

Vundavalli Sridevi respond on YSRCP complaint to disqualification

Updated On : January 9, 2024 / 1:16 PM IST

Vundavalli Sridevi: పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్ర లెజిస్లేటర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులను కలిసి ఫిర్యాదు అందజేశారు. తమ పార్టీ తరపున గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి.. పార్టీ ఫిరాయించారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, తమపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. ముందు తన వివరణ తీసుకోవాలన్నారు. నోటీసులు వచ్చాక దీనిపై స్పందిస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి కూడా అక్కడికి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ను ధిక్కరించారనే ఆరోపణలతో ఉండవల్లి శ్రీదేవితో పాటు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి వైసీపీ బహిష్కరించింది. అప్పటి నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Also Read: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే? సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు..

మరోవైపు తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు ఎమ్మెల్సీల పైనా అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి సోమవారం రాష్ట్ర లెజిస్లేటర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరగా, సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు. కాగా, తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపైనా అనర్హత వేటు వేయాలని అసెంబ్లీకి స్పీకర్ కు లేఖ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్టు సమాచారం.

Also Read: రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిన అవసరం మాకేంటి?- కొడాలి నాని హాట్ కామెంట్స్