బలహీనపడిన బురేవి తుపాన్…..దక్షిణ కోస్తా రాయలసీమల్లో వర్షాలు

  • Published By: murthy ,Published On : December 5, 2020 / 04:59 AM IST
బలహీనపడిన బురేవి తుపాన్…..దక్షిణ కోస్తా రాయలసీమల్లో వర్షాలు

Updated On : December 5, 2020 / 10:30 AM IST

weakend burevi cyclone,rains in south costal, rayalaseema : మన్నార్‌ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది. ఇక, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిని ఓమోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడులో వాయుగుండం కొనసాగుతున్నందున ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.