Weather Forecast : తెలంగాణాలో రేపు, ఎల్లుండి తేలిక పాటి వర్షాలు..ఏపీలో పొడి వాతావరణం
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షములు ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లోని కొన్ని జిలలాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని హ

Weather Forecast For Ap And Telangana
Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయ/దక్షిణ దిశల నుండి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షములు ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లోని కొన్ని జిలలాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికాలు తెలిపారు.
Also Read : Road Accident : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి-అనాధలవటంతో అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఎత్తులో ఆగ్నేయ,తూర్పు గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమలో ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.