Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్.. కోస్తా జిల్లాలకు వర్ష సూచన, మత్స్యకారులకు హెచ్చరిక
Rain Alert For AP : సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

Rain Alert For AP (Photo : Google)
ఏపీకి వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయంది. ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమైందని, రేపటికి (నవంబర్ 15) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.
Also Read : దేశంలో దీపావళి తర్వాత కాలుష్య నగరాలివే…
ఇది వాయువ్య దిశగా పయనించి ఎల్లుండి (నవంబర్ 16) ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర వాయు గుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు (నవంబర్ 15) కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.