Weather Update: అల్పపీడనం… 4 రోజుల పాటు భారీ వర్షాలు!

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Weather Update: అల్పపీడనం… 4 రోజుల పాటు భారీ వర్షాలు!

Updated On : September 11, 2021 / 10:37 AM IST

Weather Update: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని స్పష్టం చేసిన ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ.. మధ్య బంగాళా ఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Sudheer-Rashmi: తొమ్మిదేళ్ల ప్రేమకు శుభం కార్డ్.. పెళ్లి పీటలెక్కుతారా?

దీని ప్రభావంతో శనివారం నుండి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అల్పపీడనం అనంతరం
తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని సూచించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12,13 తేదీల్లో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.