YCP Govt: వైసీపీ సర్కారును కూల్చేసే కుట్ర..!?

వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని రవాణా, సమాచార మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు.

YCP Govt: వైసీపీ సర్కారును కూల్చేసే కుట్ర..!?

Jagan (1)

Updated On : August 7, 2021 / 11:04 AM IST

Perni Nani: వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని రవాణా, సమాచార మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. కాషాయం కప్పుకొన్న వ్యక్తిని సీఎంను చేయాలని, బీజేపీ కలలు కంటోందన్నారు. ‘రాష్ట్రంలో వైసీపీని ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూల్చేయాలి.. కాషాయం కప్పుకొన్నవాడిని ముఖ్యమంత్రిని ఎప్పుడు చేయాలి.’ అని ఆరోపించారు.

రాష్ట్రంలో గుళ్లు పడగొడితే అన్నీ మూసుకుని కూర్చున్న వాళ్లను చూశాం కదా! అందరూ గురివింద గింజలే. యనమల పెద్ద గురివింద గింజ. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలు. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తున్నారు’’ అని విమర్శించారు. తక్షణం బాబా రాజ్యం తేవాలని బీజేపీ చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటేనే గోతులు తీసుకోవడం, బీజేపీ నేతను సీఎం చేయాలన్నది ఆ పార్టీ ఆశయని అన్నారు.

అప్పులు తేవడాన్ని కేంద్రం తప్పు పడుతూ లేఖ రాసింది కదా? అన్న ప్రశ్నకు… ‘‘కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా? ఎవరైనా అప్పులు చేయని వాళ్లు చెప్పాలి. యనమల రామకృష్ణుడు గతంలో మీడియాతో మాట్లాడుతూ.. మేం చేయాల్సిన అప్పులు అన్ని చేశామని, ఈ ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాడు-నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని మంత్రి పేర్నినాని అన్నారు. రాష్ట్రంలో 34వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని, మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష అని అన్నారు.