Penna River: పెన్నానదిలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Penna River: పెన్నానదిలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు

Penna River

Updated On : June 25, 2021 / 3:47 PM IST

Penna River: పెన్నా నదిలో స్థానానికి దిగి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా వల్లూర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నలుగురిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీయగా మరో వ్యక్తి కోసం గజఈతగాళ్ళు వెతుకుతున్నారు.

ఈ ఘటనపై వల్లూర్ ఎస్ఐ మాట్లాడుతూ, కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు స్నానం చేసేందుకు పెన్నానదిలో దిగారని, ప్రమాదవశాత్తు వారంతా అందులో పడిపోయారని తెలిపారు. ముగ్గురు మృతదేహాలను వెలికితీయగా మరోవ్యక్తి కోసం గాలిస్తునంట్లు వివరించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read:Penna River : పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు..మూడు మృతదేహాలు వెలికితీత