మహిళ ఆత్మహత్యా యత్నం

  • Published By: murthy ,Published On : November 25, 2020 / 08:59 AM IST
మహిళ ఆత్మహత్యా యత్నం

Updated On : November 25, 2020 / 9:36 AM IST

widow suicide attempt at guntur district : ఉపాధికోసం హోటల్ ఏర్పాటు చేసుకున్న ఒంటరి మహిళ స్ధలాన్ని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేయటానికి ప్రయత్నించటంతో ఆమహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోటానికి ప్రయత్నించింది. గుంటూరు జిల్లాలో ఈదారుణం జరిగింది.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో భర్త చనిపోయి ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేని ఓ బీసీ మహిళ తన కొడుకు,కూతురు తో కలిసి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించుకుంటోంది. హోటల్ పక్కనే ఉన్న స్ధలాన్ని కృష్ణా రెడ్డి అనే స్ధానిక రాజకీయ నాయకుడు కొనుగోలు చేసాడు. ఈమె హోటల్ స్ధలాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించింది.



హోటల్ కనక తీసివేస్తే తనకు ఉపాధి కరువవుతుందని. తనకు చావే శరణ్యం అంటూ కొడుకు, కూతురుతో కలిసి పురుగుల మందు తాగటానికి ఆమె ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా….హోటల్ స్థలంలో తనకూ భాగం ఉందని కృష్ణారెడ్డి నాదెండ్ల పోలీసులకు పిర్యాదు చేశాడు.