ఏపీలో కిడ్నాపైన మహిళ……తెలంగాణలో శవమై తేలింది

  • Published By: murthy ,Published On : September 5, 2020 / 03:38 PM IST
ఏపీలో కిడ్నాపైన మహిళ……తెలంగాణలో శవమై తేలింది

Updated On : September 5, 2020 / 4:06 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్‌పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.

మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్‌లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడంతో, ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆగష్టు 31న సాయంత్రం. పద్మను చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. కాగా పద్మ మృతదేహం శుక్రవారం సెప్టెంబర్4న,  హైదరాబాద్  సమీపంలోని నార్కెట్‌పల్లి వద్ద గుర్తించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

mtm kidnap lady 2పద్మ టిక్ టాక్ వీడియోల ఆధారంగా ఆమెను తీసుకు వెళ్ళారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందరితో కలివిడిగా ఉండే పద్మ  దారుణ హత్యకు గురికావడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళను కేవలం నగలు, డబ్బు కోసమే హతమార్చారని  స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.

mtm kidnap lady 2